పేరుకు నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బహుశా ఇండియాలో ఇప్పుడీ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక బాహుబలి చిత్రంతో విదేశాల్లోనూ యంగ్ రెబల్ స్టార్ క్రేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. నేటితో (అక్టోబర్ 23) డార్లింగ్ 41వ పడిలోకి పడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుల్లి తెర ఆయన అభిమానులకు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు ప్రభాస్ నటించిన ఏకంగా ఆరు సినిమాలు టీవీలో ప్రసారం కానున్నాయి. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన బాహుబలి, మిర్చి, బుజ్జిగాడు, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, వర్షం చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. రెబల్ స్టార్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది అద్దంపడుతుందని ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రం, బాలీవుడ్లో ఆది పురుష్తో పాటు..నాగ్ అశ్విన్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.