పూజా హెగ్డే అంత తీసుకుంటోందా..? 

నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి పూజా హెగ్డే. అందమైన రూపం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది టాలీవుడ్ లోని అగ్రహీరోల సరసన ఆడిపాడింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజ హెగ్డే తీసుకుంటోన్న పారితోషకానికి సంబంధించిన ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. అల వైకుంఠపురం లో సినిమాకి రూ. 1.4 కోట్లు తీసుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఆమె తన రెమ్యూనరేషన్ ను రూ. 2 కోట్లకు పెంచేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒకేసారి అరకోటి పారితోషకం పెంచడంతో ఈ వార్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సూత్రాన్ని పూజా హెగ్డే తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ఇక పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ తో పాటు.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here