‘శాకుంతలమ్’కు పూజ నో చెప్పిందా..?

పురాణ, ఇతిహాసాల కథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఇటీవల ‘శాకుంతలం’ అనే భారీ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మహాభారతంలోని ఆదిపర్వంలో అద్భుతమైన, అందమైన ప్రేమ కథను శాకుంత‌లం చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు. గుణశేఖర్ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే అంశం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం నటి పూజా హెగ్డేను చిత్ర యూనిట్ సంప్రదించిందని.. కానీ దానికి పూజ నో చెప్పిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పూజకు ఇప్పట్లో లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే ఆసక్తి లేదని… అంతేకాకుండా ఈ సినిమాలో కొంతమేరకు ఓ బిడ్డకు తల్లిగా నటించే పాత్ర కావడంతో పూజా ఈ సినిమాకు నో చెప్పిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

ఇదిలా ఉంటే శాకుంతలంలో హీరోయిన్‌గా అనుష్క నటిస్తేనే బాగుంటుందని నెట్టింట్లో ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి చిత్రంలో అనుష్క నటించిన విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి కూడా అనుష్క అయితేనే న్యాయం చేస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే గుణశేఖర్ స్పందిచాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here