కవితని కలిసిన పెళ్లి చూపులు బృందం ..

నేషనల్ ఫిలిం అవార్డ్ లలో ఉత్తమ తెలుగు చిత్రం గా అవార్డు అందుకున్న పెళ్లి చూపులు చిత్రం తెరాస ఎంపీ కవితని కలిసారు . ఆమె నివాసం లో ప్రత్యేకంగా ఈ బృందం కనిపించారు. తాము రాష్ట్రపతి చేతులమీదగా అందుకున్న అవార్డులు ఆమెకి చూపించారు వీరు. కుటుంబ కథా చిత్రాలకి ఆదరణ ఉంటుంది అనేందుకు ఇది నిరూపణ అని కవిత చెప్పుకొచ్చారు.

తెలంగాణా ప్రభుత్వం నుంచి ఇలాంటి సినిమాలకి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అని మాట్లాడిన ఆమె డైరెక్టర్ తో కాసేపు సినిమా అనుభవాల గురించి ముచ్చటించారు. తరుణ్ భాస్కర్ వ్యక్తిగత జీవితం ,అతను ఏ రకంగా పైకి వచ్చాడు ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడిన కవిత నిర్మాతలు యాష్ రంగినేని, రాజ్ కందుకూరి, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ల అనుభవాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మామూలుగానే సినిమాలు ఇష్టంగా చూసే కవిత నేషనల్ అవార్డ్ సినిమా విన్నర్ కావడం తో వారితో ఆసక్తిగా మాట్లాడ్డం కనిపించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here