పాపం…  పాయల్ ఎలా ఏడుస్తుందో చూడండి.!

https://www.instagram.com/p/CFl0z_4HOjE/

కరోనా మహమ్మారి.. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా.. ఇళ్లకే పరిమితమైన వారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇక కేంద్రం ఇచ్చిన సడలింపులతో…  సినిమా చిత్రీకరణలను తిరిగి మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే అందాల నటి పాయల్ రాజ్ పుత్ తాజాగా సినిమా చిత్రీకరణలో పాల్గొంది. ఈ నేపథ్యంలో పాయల్ ముందు జాగ్రత్తగా కరోనా పరీక్ష నిర్వహించుకుంది. షూటింగ్ స్పాట్ లోనే ఓ వైద్యుడు శాంపిల్స్ సేకరించాడు. ఈ క్రమంలో తీసిన వీడియోను నటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అయితే శాంపిల్స్ సేకరించే క్రమంలో పాయల్ కాస్త ఇబ్బందికి గురి అయింది. ముక్కులో ఇయర్ బడ్ పెట్టడంతో.. నొప్పి తట్టుకోలేక ఏడ్చేసింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ… ‘అన్ని ముందు జాగ్రత్త చర్యలతో నా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కరోనా టెస్ట్ కోసం నా ముక్కు లోపల 5 సెకన్ల పాటు ఒక పరికరకంతో శుభ్రముపరిచిన విధానం మాత్రం భయంకరంగా అనిపించింది. కానీ, నేను ఆ టెస్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఏది ఏమైనా ఇది పూర్తి కావడానికి నేను నిజంగా భయపడ్డాను’ అని  క్యాప్షన్ ను జోడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here