‘బాహుబలి 2 కి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఇచ్చాడు’

వెండితెర కొత్త సంచలనం బాహుబలి 2 గురించి ఈనాడు పేపర్ తో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ – రాజమౌళి తండ్రి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ పూర్తి హై లైట్ గా సాగిన ఈ సినిమా లో భల్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ టైం లో ప్రజలు రాజుగా బాహుబలి ఎన్నిక అవుతాడు అనుకుంటే శివగామి భల్లాల దేవుడిని నిలబెడుతుంది. సర్వ సైన్య ధ్యక్షుడి గా నిలబడిన బాహుబలి కోసం జనం హోరెత్తే సన్నివేసం ఇండియన్ సినిమా చరిత్ర లో ఎప్పుడూ లేనంత హంగామా చేసింది.

సినిమా మొత్తం మీద హై లైట్ సన్నివేసం గా ఈ సీన్ నిలుస్తుంది. అయితే ఈ సీన్ గురించి చెప్పిన విజయేంద్ర ప్రసాద్ .. ఓ కాన్సెప్ట్ ను అనుకున్నామని, ఇక దీన్ని తెరపైకి ఎలా ఎక్కించాలా అని మధనపడుతున్న వేళ, అనుకోకుండా టీవీ పెడితే, ఓ ఆడియో ఫంక్షన్ వస్తోందని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ లేని ఆ ఆడియో ఫంక్షన్ లో పవన్ పేరు వినపడగానే ఫాన్స్ వెర్రిగా ఊగిపోయారు అనీ ఆ తరవాత ఐదు నిమిషాల పాటు ఎవరు ఏం మాట్లాడినా వినపడలేదు అన్నారు. ఈ కాన్సెప్ట్ నే సినిమాలో వాడేసారట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here