ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై క్లారిటీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌టి నుంచి అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీతో క‌ల‌సి పొత్తులో ఉన్న జ‌న‌సేన ఏఏ అంశాలు చ‌ర్చిస్తుందో అన్న చ‌ర్చ న‌డిచింది. ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డానికి ఆయ‌న వేచి చూస్తూనే ఉన్నార‌ని నిన్న‌టి నుంచి వార్తలు వెలువ‌డుతూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఢిల్లీ వచ్చినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. నడ్డాతో భేటీ అనంతరం పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానంగా తిరుపతి బైపోల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పారు. ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా? అన్నది రెండ్రోజుల్లో తేలిపోతుందని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.

అమరావతి, పోలవరం అంశాలపై కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్ తెలిపారు. గంట సేపు నడ్డాతో మాట్లాడినట్లు వివరించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి గురించి, దేవాలయాలపై దాడులు. లా అండ్ ఆర్డర్ గురించి కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here