పాఠ‌శాల‌లు ఇప్ప‌ట్లో తెరిచే ప్ర‌స‌క్తే లేదా..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు వేగంగా చేప‌డుతోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 6,224 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో 4,943 మంది కోలుకున్నారు, 109 మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 5,40,541కి చేరుకున్నాయి. వీరిలో 4,93,419 మందికి స్వస్థత చేకూరగా, 38,501 యాక్టివ్ కేసులు ఉన్నారు. మృతుల సంఖ్య 8,621కి చేరింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 480 మంది మృత్యువాత పడ్డారు.

కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీలో మూతపడిన పాఠశాలలు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే వరకు తెరుచుకునే అవకాశాలు లేవని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. కొవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 16 నుంచి అన్ని పాఠశాలలు, యూనివర్సిటీలు మూతపడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ… చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

దీంతో తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు స్కూళ్లు తెరవొద్దంటూ సిసోడియా ఇటీవల ప్రకటించారు. గత కొద్ది వారాలుగా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం కంటిమీద కునుకులేకుండా గడుపుతోంది. నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. గత వారం రోజులుగా రోజుకు సగటున 6 వేల చొప్పన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చలికాలం ప్రారంభం కావడంతో పాటు వాయు కాలుష్యం కూడా కేసులు అమాంతం పెరిగేందుకు కారణమైనట్టు నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here