పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ .. పాపం ఇలా అయిపొయింది ఏంటి ఈయన పరిస్థితి

పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంటే చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ కి ఎవ్వరికీ దక్కని ఛాన్స్ దక్కింది. గోపాల గోపాల , సర్దార్ గబ్బర్ సింగ్ , కాటమారాయుడు ఇలా మూడు సినిమాలు మారారం నిర్మించారు. కానీ దురదృష్టం ఏంటో కానీ మూడూ డిజాస్టర్ సినిమాలే. మరార్ కి ఈ సినిమాల వలన బాగానే డబ్బు అందింది కానీ మునిగిపోయింది బయ్యర్ లు అని అంటారు చాలా మంది. మరార్ నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది ఆసక్తికర విషయం.

పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పట్లో మళ్ళీ మరార్ కి అవకాశం ఇవ్వడు కాబట్టి ఆయన ఇప్పుడు తమిళం లోని మేర్సాల్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. విజయ్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి అత్లీ డైరెక్టర్ .. తమిళ డబ్బింగ్ సినిమాని తెలుగు లో అందించడం మామూలే కానీ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోతో సినిమా చేసిన తరవాత కూడా ఈ గతేంటి అంటున్నారు చాలా మంది. ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ ఊరూ పేరూ లేని చిన్న సినిమాను సమర్పిస్తున్నాడు మరార్. ప్రాజెక్ట్ విక్టరీ అనే ఒక చిన్న సినిమాని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అనే తన బ్యానర్ లో మరార్ ప్రకటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here