జ‌గ‌న్ ప‌థ‌కాల‌ను ఆరా తీస్తున్న ఇత‌ర రాష్ట్రాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేప‌ట్టిన త‌ర్వాత విభిన్న‌మైన పథ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నారు. దీంతో ఈ ప‌థ‌కాలు దేశం మొత్తం ఆక‌ర్షిస్తున్నాయి. ఏపీలో అమ‌ల‌వుతున్న వీటి గురించి ఇతర రాష్ట్రాలు కూడా ఆరా తీస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ దేశ వ్యాప్తంగా ఫేమ‌స్ అవుతున్నారు.

వై.ఎస్ జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఏపీలో అభివృద్ధికి వినూత్న రీతిలో ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆయ‌న స‌రిదిద్దారు. అమ్మఓడి, చేయూత‌, ఆస‌రా, విద్యా కాన‌క ఇలా ఎన్నో ప‌థ‌కాలు తీసుకొచ్చారు. వీటితో రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నారు. గ‌తంలో సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో ప‌లు ఇబ్బందులు ఉండేవి. కేవ‌లం అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికే ప‌థ‌కాల ద్వారా ల‌బ్ది వ‌చ్చేది. అయితే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక అన్ని వ‌ర్గాల వారికి కులం, మ‌తం, పార్టీ అన్న తేడాలు లేకుండా ప‌థ‌కాలు అందుతున్నాయ‌న్న మంచి పేరు ఉంది.

రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం అన్ని విధాలా అన్వేషించి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా గ్ర‌హించింది. ఏపీలో తీసుకొస్తున్న సంస్క‌ర‌ణ‌ల‌పై మోదీ మాట్లాడారు కూడా. ఇప్పుడు కొత్త‌గా ప్రారంభించిన జ‌గ‌న‌న్న విద్యా కానున ప‌థ‌కంతో మ‌రోసారి దేవ వ్యాప్తంగా జ‌గ‌న్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని తీసుకువ‌చ్చిన ఈ ప‌థ‌కం పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంతా అనుకుంటున్నారు. పైగా ఈ ప‌థ‌కం విధి విధానాల‌ను ఇరుగుపొరుగు రాష్ట్రాలు కూడా ప‌రిశీలిస్తున్నాయ‌ని తెలుస్తోంది. మొత్తంగా జ‌గ‌న్ తీసుకుంటున్న ఈ నిర్ణ‌యాలు దేశ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here