గంటా శ్రీనివాసరావును ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు : అవంతి శ్రీనివాస్

టీడీపీ మాజీ మంత్రుల్లో తర్వాతి అరెస్ట్ గంటా శ్రీనివాసరావుదేనని మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు అరెస్టయ్యారని తర్వాత గంటా శ్రీనివాసరావే అరెస్టవుతారన్నారు.

రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి సైకిళ్ల కుంభకోణం జరిగిందంటూ ట్వీట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం అప్పటి నుండి గంటా శ్రీనివాసరావును ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే టీడీపీ నేతలను టార్గెట్ ను చేశారని వరుసగా అరెస్టులు చేస్తూ పోతారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఒకప్పుడు గంటా శ్రీనివాస్ మరియు అవంతి కలిసి రాజకీయం చేశారు. ఇద్దరూ పీఆర్పీ తరపున ఎన్నికయ్యారు. తర్వాత ఇద్దరూ టీడీపీలోకి వచ్చారు. అవంతి తర్వాత వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. గంటా ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ ఓడిపోవడంతో ఫలితం లేకపోయింది. ఇదిలావుండగా ప్రభుత్వం టీడీపీ నేతల్ని ఎలా టార్గెట్ చేసిందో వివరిస్తూ ఆధారాలతో సహా రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసినట్లుగా టీడీపీ ఎంపీలు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here