కేటీఆర్ ప్రత్యేక ఎజెండా..ఇన్వెస్ట్ తెలంగాణ

ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎవరూ నేరుగా వచ్చి ప్రభుత్వాన్ని కలిసే పరిస్థితి లేదు. అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడిదారులు కనెక్ట్ అయ్యేందుకు హైటెక్ ఏర్పాట్లు చేశారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకు వచ్చారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సంపూర్ణ సమాచారాన్ని ఐటీ, పరిశ్రమల శాఖల వివరాల్ని ఇన్వెస్ట్‌ తెలంగాణ వెబ్‌సైట్‌లో పొందుపరిచాయి. వెబ్‌సైట్‌లో ఇప్పటికే పలు ప్రభుత్వసేవలకు సంబంధించిన లైవ్‌లింక్‌లు ఉన్నాయి. వీటి ద్వారా పెట్టుబడిదారులు ఆయా సేవలను నేరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.పెట్టుబడుల తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని కేటీఆర్ చెబుతున్నారు.

కేటీఆర్ ఐటీ రంగాన్ని హైదరాబాద్ నలుమూలలా విస్తరించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకి అటూ ఇటూ ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను అక్కడి నుంచి తొలగించి ఆ స్థానంలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలన్న ఆలోచన చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు హైదరాబాద్‌కు కలసి వస్తున్నాయి. అలాగే తయారీ పరిశ్రమలు చైనా నుంచి ఇండియాకు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కేటీఆర్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన పూర్తిగా పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి కేంద్రీకరించారని  సమాచారం.

హైదరాబాద్ లో టెక్నాలజీకి మరింత మెరుగైన భవిష్యత్ కనిపిస్తోంది. ఆ రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఆయా రంగాలకు హైదరాబాద్‌లో అనుకూల పరిస్థితులు ఉన్నాయని సందేశం పంపేందుకు కేటీఆర్ ఎప్పటికప్పుడు కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలా ఆయన ఆలోచనలకు రూపకల్పనే ఈ ఇన్వెస్ట్ తెలంగాణ యాప్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here