పార్ల‌మెంటు కొత్త భ‌వ‌న నిర్మాణం కాంట్రాక్టు టాటాకే..!

భార‌త‌దేశ పార్ల‌మెంటు భ‌వ‌నం ఎంతో చ‌రిత్ర క‌లిగింది. ఎంతో పురాత‌మైన ఈ భ‌వ‌నం స్థానంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. ఇందుకోసం సెంట్ర‌ల్ ప‌బ్లిక్ డిపార్ట్‌మెంట్ బిడ్ల‌ను ఆహ్వానించింది.

ఇప్పుడున్న పార్ల‌మెంటు భ‌వ‌నం కంటే పెద్ద‌గా ఉండేలా కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు. ఎందుకంటే భ‌విష్య‌త్‌లో కొన్ని దశాబ్దాల పాటు ఇది సేవ‌లందించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పార్ల‌మెంటు భ‌వ‌న నిర్మాణం జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఆహ్వానించిన బిడ్ల‌లో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ. 861.90 కోట్లు బిడ్ దాఖ‌లు చేసింది. ఎల్ అండ్ టి సంస్థ 865 కోట్ల బిడ్ దాఖ‌లు చేసింది.

ఎల్ అండ్ టి కంటే రూ.3.10 కోట్లు త‌క్కువ‌గా బిడ్ దాఖ‌లు చేయ‌డంతో టాటా సంస్థ‌కే కాంట్రాక్టు ద‌క్కింది. నూత‌న పార్లమెంటు భ‌వ‌న కాంట్రాక్టు ద‌క్క‌డం ప‌ట్ల టాటా సంస్థ సంతోషం వ్య‌క్తం చేసింది. మ‌రో ఏడాదిలో నూత‌న పార్లమెంటు భ‌వ‌న నిర్మాణం పూర్తి చేస్తామ‌ని తెలిపింది. ఇందులో భాగ‌స్వామ్యులు అవ్వ‌డం గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొంది. కాగా కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం త్రిభుజాకారంల ఉండ నుంది. ఇప్ప‌టి పార్ల‌మెంటు భ‌వ‌నం బ్రిటీష్ ఆర్కిటెక్స్ డిజైన్ చేశారు. ఇప్పుడున్న భ‌వ‌న నిర్మాణం 1921లో ప్రారంభించి 1927లో పూర్తి చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here