” అరవైయేళ్ళ వ్యక్తి తో నాకు పెళ్ళా ? ” హీరోయిన్ ప్రశ్న

భారీ అందాల భామగా తమిళంలో ఒకప్పుడు నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. కొత్త కథానాయికల రాక ఎక్కువగా ఉండటంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది.
 ఈ ప్రచారం పట్ల నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. నా వయసేంటి? .. ఇంత సిల్లీగా ఎలా పుకార్లు పుట్టిస్తున్నారు? ఎలా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నారు? అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది. ఇక శరత్ బాబు కూడా ఈ ప్రచారం తన ఇమేజ్ ను దెబ్బతీస్తోందంటూ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 60 యేళ్లు దాటిన తనకి మళ్లీ పెళ్లేమిటి? ఒకవేళ చేసుకోవాలనుకుంటే ముందుగా మీడియాకే చెబుతానని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రచారానికి ఇంతటితో తెరపడుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here