సమంత దారిలో చైతన్య..!

ప్రస్తుతం అంతా వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తోంది. అంతర్జాతీయ సంస్థలు, బడా నిర్మాతలు ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో వెబ్‌ సిరీస్‌ల రేంజ్‌ పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లు మూతబడ్డ ఇలాంటి సమయాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ప్రేక్షకులకు వెబ్‌ సిరీస్‌లే దిక్కయ్యాయి. బడా హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్‌ సిరీస్‌లలో నటించడానికి ఒకే చెప్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని నట వారసుడు నాగ చైతన్య కూడా వెబ్‌ సిరీస్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. చైతన్య ఓ వెబ్‌ సిరీస్‌కు సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఓ ప్రముఖ వెబ్‌ స్ట్రీమింగ్‌ సంస్థ ఇప్పటికే చై తో చర్చలు జరుపుతోందని.. దీనికి చైతన్య కూడా దాదాపు ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌ సర్కిల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెబ్‌ సిరీస్‌ల హవా నడుస్తుండడంతో చైతన్య వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య భార్య సమంత ఇప్పటికే ‘ఫ్యామిలీ మాన్’ వెబ్‌ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే విడుదల కానుంది. సమంత వెబ్‌ సిరీస్‌లో నటించిన తర్వాత చైతన్య కూడా ఆ దారిలో అడుగులు వేస్తుండడతో భార్య చూపిన దారిలో భర్త అడుగులు వేస్తున్నాడని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here