జ‌గ‌న్‌ను పొగిడిన మోదీ.. టిడిపిలో ఏం జ‌రుగ‌నుంది..

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, జ‌గ‌న్‌ల మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయ‌ని చెప్ప‌డానికి ఆధారాలు దొరికాయ‌ని చెప్పొచ్చు. వైసీపీ, బీజేపీ బందం బ‌ల‌ప‌డబోతోంద‌ని స్వ‌యంగా మోదీ సంకేతాలు ఇచ్చార‌ని అంతా అనుకుంటున్నారు. ఈ విష‌యాల‌న్నింటికీ సీఎం తిరుమ‌ల ప‌ర్య‌ట‌న వేదిక కావ‌డం విశేషం.

బుధ‌వారం ఢిల్లీలో కేంద్ర మంత్రుల‌ను క‌లిసి అనంత‌రం తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ వెళ్లారు. తిరుమ‌ల వెళ్లిన జ‌గ‌న్‌.. అక్క‌డి నుంచే ప్ర‌ధానమంత్రి వీడియో కాన్ఫ‌రెన్సులో మాట్లాడారు. రాష్ట్రంలో ఎలాంటి ప‌థకాలు అమ‌లు చేస్తున్నారో, క‌రోనా నివార‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో వివ‌రించారు. అనంత‌రం మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో మీరు అమ‌లు చేస్తున్న గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌ర‌రుగుతోంద‌న్నారు.

త్వ‌రిత‌గ‌తిన ప్ర‌జ‌ల‌కు సేవలు అందుతున్నాయ‌న్నారు. ఒకింత సీఎం జ‌గ‌న్ మాట్లాడుతుండ‌గా మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకున్న మోదీ సీఎం వెనుకున్న శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి చిత్ర‌ప‌టాన్ని చూసి స్పందించారు. వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం అయ్యింద‌న్న సంతోషం క‌లుగుతోంద‌ని మోదీ అన్నారు. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాల్లొ పాల్గొనేందుకు వ‌చ్చి కూడా వీడియో కాన్ఫ‌రెన్సులో పాల్గొంటున్నార‌ని జ‌గ‌న్‌ను మోదీ అభినందించారు.

ఈ ప‌రిణామాల‌న్నీ తెలుసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇక ఏం ఆలోచ‌న‌లు వ‌స్తాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌న‌లేదు. ఎందుకంటే ఇన్నాళ్లూ జ‌గ‌న్ మోదీ మ‌ద్య ఎలాంటి బంధం ఉందో అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ అభిప్రాయం చూసిన త‌ర్వాత క‌చ్చితంగా వీరిద్ద‌రూ ఒక ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్లు మ‌న‌కు తెలుస్తోంది. జ‌గన్‌పై మోదీకి ఎంత మంచి అభ్రిపాయం ఉందో ఇట్టే తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here