ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ:మోడీ

ఈ రోజు 74 వ స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా ఢిల్లీ లో ఎర్రకోట వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. పలు కీలక నిర్ణయాలను ప్రజలతో పంచుకున్నారు. అయితే ఇందులో ఆత్మ నిర్భర్ భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడేలా ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థలా నిలబడేలా ప్యాకేజీ ప్రయోజనాలను అన్ని వర్గాల వారికి అందించేలా ప్యాకేజీని రూపకల్పన చేశారు. దీనికి “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” అనే పేరు పెట్టారు.

స్వాతంత్ర్య సంగ్రామం ప్రేరణ తో నే దేశం ముందుకు సాగుతోంది అని మోడీ తెలిపారు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్దం అయింది అని అన్నారు. అయితే ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో దేశం మొత్తం ఒక్కటై నిలిచింది అని పేర్కొన్నారు. అయితే 25 ఏళ్లు వచ్చిన ప్రతి బిడ్డా కూడా సొంత కాళ్ళ పై నే నిలబడాలని కుటుంబం కోరుకుంటుంది అని, అయితే భారత్ 75 ఏళ్ల తర్వాత కూడా స్వయం సమృద్ది సాధించ లేకపోయింది అని తెలిపారు.

నేటి నుండి స్వయం సమృద్ది కి బలమైన సంకల్పం తో ముందుకు వెళ్లాలి అని భారతీయులందరికీ మోడీ పిలుపు ఇచ్చారు.ప్రపంచం ఎపుడూ కూడా పరస్పర ఆధారితం, ఏ ఒక్కరూ కూడా ఒంటరిగా ఉండలేరు అని, భారత్ అంటే కేవలం క్రమ శిక్షణ మాత్రమే కాదు, ఉన్నత విలువలతో కూడిన జీవనం అని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచ కళ్యాణానికి మన వంతు కూడా నిరంతరం చేస్తున్నాం అని, ఆత్మ నీర్భర్ భారత్ అనేది నినాదం మాత్రమే కాదు అని, భారత్ కోసం మనందరి సంకల్పం కావాలి అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ యువత ఆత్మ విశ్వాసం తో ఆత్మ నిర్భర్ భారత్ సాధించాలి అని యువతకి ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here