నేనూ డిప్రెషన్ బాధితురాలినే.. 

డిప్రెషన్.. బయటకి కనిపించని ఈ మానసిక వ్యాధితో ఎంతో మంది బాధపడుతుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తేడా లేకుండా అందరూ జీవితంలో ఏదో ఒక సమయంలో డిప్రెషన్ కు  గురైన వారే. ఇక తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం డిప్రెషన్ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందాల నటి

మెహ్రీన్ కూడా తాను డిప్రెషన్ కు గురయ్యానని చెప్పుకొచ్చింది. ఈ మానసిక సమస్యపై మెహ్రీన్ మాట్లాడుతూ..’ప్రతి ఒక్కరి జీవితంలో డిప్రెషన్ ఉంటుంది. నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను. దాన్నుంచి ఎంత త్వరగా బయటకొచ్చామన్నది? ముఖ్యం. మనల్ని మనం నమ్మాలి, దేవుడ్ని నమ్మాలి. జీవితం చాలా అందమైనదనే విషయాన్ని పదేపదే గుర్తుచేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలి. అప్పుడు మాత్రమే డిప్రెషన్ నుంచి బయటపడగలం. నిజం చెప్పాలంటే ఈ బిజీ లైఫ్ లో మానవ జాతి మొత్తం డిప్రెషన్ ను ఫేస్ చేస్తోంద’ని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.  మెహ్రీన్ చెప్తోన్న జీవిత పాటలను పాటిస్తే ప్రతీ ఒక్కరూ మానసిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here