ప్రజల ప్రాధాన్యతకు ‘మేఘా’ యాన్యుటీ

ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి. అందులో ప్రాధాన్యత ప్రకారం పనులు చేయాలన్న అందుబాటులో ఉన్న బడ్జెట్‌ నిధులు సరిపోవు. అప్పులు చేయాలన్న అనేక షరతులు అమలు కావాలి. వడ్డీలు కూడా ప్రభుత్వానికి భారమవుతాయి. అలా అని పట్టించుకోకపోతే ప్రజలకు కనీస మౌళిక వసతులు కల్పించడం కష్టమవుతుంది. ప్రాజెక్ట్‌లపైనే నిధులు వెచ్చిస్తే సంక్షేమ, ఉపాధి రంగాలు కుంటుపడతాయి. ఇందుకు పరిష్కారమే యాన్యుటీ విధానం. ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులను సొంతంగా సమకూర్చుకొని వాటిని సకాలంలో పూర్తి చేసి ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఆ నిధులను దశలవారిగా రాబట్టుకునే విధానాన్ని తాగునీరు, విద్యా రంగంలో మౌళిక వసతులను మేఘా ఇంజనీరింగ్‌ అమలు చేస్తోంది.

ఈ విధానం దేశంలో తొలిసారిగా ఎంఈఐఎల్‌ అమలులోకి తెచ్చింది. యాన్యుటీ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంఈఐఎల్‌ మొత్తం 6000 కోట్ల రూపాయలను సొంతంగా వ్యయం చేయనుంది. ఈ విధానం వివిధ రంగాల్లో విఫలమైన తర్వాత ఏ సంస్థా కూడా ముందుకు రాని పరిస్థితుల్లో మేఘా ధైర్యంగా ముందడుగు వేసింది. తెలంగాణలోని కేశవపూర్‌ రిజర్వాయర్‌ (హైదరాబాద్‌), హైదరాబాద్‌ నగర శివార్లలోని ఓఆర్‌ఆర్‌ పరిసర 190 గ్రామాలకు, 5 నగర పంచాయతీలకు తాగునీరు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 2426 పాఠశాలల నిర్మాణం, ఓడిషాలో భువనేశ్వర్‌ బల్క్‌ తాగునీటి ప్రాజెక్ట్‌లను ఎంఈఐఎల్‌ యాన్యుటీ విధానంలో చేపట్టింది.

హైబ్రీడ్ యాన్యుటీలో కేశవాపూర్‌ రిజర్వాయర్‌…

హైదరాబాద్‌ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 10 టీఎంసీల జలాశయాన్ని ఎంఈఐఎల్‌ శామీర్‌పేట్‌ మండలం కేశవాపూర్‌ వద్ద ఏర్పాటు చేయనున్నది. రిజర్వాయర్‌తో పాటు శామీర్‌ పేట పరిసర గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 750 ఎంఎల్డీ వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంటును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎంఈఐఎల్‌ హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌ లో చేపట్టి 4396.15 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. ఈ విధానంలో ప్రభుత్వం 20 శాతాన్ని సమకూరిస్తే ఎంఈఐఎల్‌ 80 శాతాన్ని ఖర్చు చేయనుంది. ఈ 80 శాతాన్ని నిర్వహణ సమయంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. మేఘా ఇంజనీరింగ్‌ త్వరలో పనులు ప్రారంభించనుంది. యాన్యుటీ పద్ధతిలో మాత్రం మొత్తం వ్యయాన్ని సంస్థ భరించాలి. ప్రభుత్వం ఎటువంటి మొత్తాన్ని సమకూర్చదు.

గ్రేటర్‌ గ్రామాలకు మేఘా తాగునీరు:

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ (ఔటర్‌ రింగ్‌రోడ్డు) పరిధిలోని 190 గ్రామాలకు తాగునీరు అందించేందుకు యాన్యుటీ మోడల్‌లో ఎంఈఐఎల్‌ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇందుకోసం రూ.628 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనుంది. పనిపూర్తయ్యాక ఏడేళ్ళ కాలంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

నగరపంచాయతీలకు తాగునీటి సరఫరా:

తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని నగరపంచాయతీలైన హుస్నాబాద్‌, ఆంధోల్‌ జోగిపేట, హుజూర్‌ నగర్‌, కోదాడ, దేవరకొండకు మిషన్‌ భగీరథ (అర్బన్‌) పథకంలో భాగంగా తాగునీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ యాన్యుటీ విధానంలో చేపట్టింది. ఇందుకోసం ఎంఈఐఎల్‌ రూ.163.85 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని ఏడేళ్లలో ఏడాదికి కొంత చొప్పున ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకాన్ని 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది.

‘మేఘా’ ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం:

సర్వశిక్ష అభియాన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాల్లోని 46 మండలాలకు చెందిన 1378 ప్రభుత్వ పాఠశాలలు, ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని 1048 ప్రభుత్వ పాఠశాలలను మేఘా హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో నిర్మిస్తున్నది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.589.72 కోట్లు కాగా, ఇందులో 60 శాతం నిధులను ఎంఈఐఎల్‌ సమకూరుస్తున్నది. ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్ట్‌ను ఎంఈఐఎల్‌ నిర్వహిస్తుంది.

భువనేశ్వర్‌ బల్క్‌ వాటర్‌…

2017లో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ద్వారా ఎంఈఐఎల్‌ ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీ భువనేశ్వర్‌, ఎన్‌ఐఎస్‌ఈఆర్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసర్చి), పారిశ్రామిక పార్కుతో పాటు భువనేశ్వర్‌ పరిసర మున్సిపాలిటీలైన ఖోర్దా, జాట్నాకు తాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఎంఈఐఎల్‌ రూ.187 కోట్లను యాన్యుటీ విధానంలో ఖర్చు చేసింది. 25ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here