ఆ డేట్ అయితే బెటర్ అని ఫీల్ అవుతున్న రంగస్థలం టీం

చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘రంగస్థలం 1985’ విశేషాల పట్ల అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. గోదావరి జిల్లాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన ఈ సినిమా టీమ్, హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేశారు.
ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు వున్నట్టుగా నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయానికి ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. మార్చి 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. దాదాపు ఇదే తేదీ ఖరారు కావొచ్చని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కనువిందు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here