ఖలేజాకు పదేళ్లు..

‘ఖలేజా’ చిత్రం టీవీలో వస్తే ఇప్పటికీ టీవీకి అతుక్కుపోయేవారున్నారంటే అతిశయోక్తికాదు. థియేటర్‌లో పెద్దగా విజయం సాధించని ఈ చిత్రం.. టీవీ స్క్రీన్‌ మీద మంచి రేటింగ్స్‌తో దూసుకెళ్లింది. దేవుడుకి అసలైన అర్థం చెబుతూ.. మంచి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్‌ నటన అద్భుతంగా ఉంటుంది. ఈరోజుతో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహేష్‌ బాబు ‘ఖలేజా’ సినిమా గురించి ట్వీట్ చేశారు. చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘ఖలేజాకు 10 ఏళ్లు..! నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించింది. ఎప్పటికీ నాకు ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుందీ చిత్రం. నా బెస్ట్ ఫ్రెండ్ బ్రిలియంట్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. అతి త్వరలోనే.. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాము’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు మహేష్. ఇదిలా ఉంటే మహేష్ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన అనుష్క.. ‘ఈ సినిమాతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. మహేష్‌ గారికి, త్రివిక్రమ్‌ గారితో పాటు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు అని క్యాప్షన్‌ను జోడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here