డ్రగ్స్ కేసులో మహేష్ బాబు భార్య పేరు..? 

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం పలు మలుపులు తీసుకొని ఇప్పుడు డ్రగ్స్ వైపు మలుపు తిరిగింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో బడా స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా  ఈ కేసులో టాలీవుడ్ అగ్రనటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడ్డట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నమ్రతకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్టుగ విచారణ ఎదుర్కొంటున్న జయసాహా వాజ్ఞ్మూలం ఇచ్చారు. ఎన్సీబీ ట్రాకింగ్‌లో జయసాహా, నమ్రత చాటింగ్ కూడా బయటపడింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే వినిపించగా… ప్రస్తుతం నమ్రత పేరు రావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here