ఆ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్‌..

దేశంలో క‌రోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు.

త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. సీఎంతో స‌న్నిహితంగా ఉన్న వారంతా క్వారంటైన్‌లోనికి వెళ్లిపోయారు. ఇక త‌న‌ను క‌లిసిన వారంద‌రూ కోవిడ్ టెస్టు చేపించుకోవాల‌ని సీఎం కోరారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రోజురోజుకూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 736 మందికి క‌రోనా పాజిటివ్ వచ్చింది. క‌రోనా సోకిన అనంత‌రం సీఎం మాట్లాడుతూ స‌మావేశాల‌పై జాగ్ర‌త్త‌లు వ‌హిస్తాన‌న్నారు. ఇక‌పై వీడియె కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా క‌రోనాపై స‌మీక్షిస్తాన‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here