‘లవ్ స్టోరీ’ కోసం పోటీ పడుతోన్న ఓటీటీ సంస్థలు.. 

నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడిన విషయం తెలిసిందే. దీంతో లవ్ స్టోరీ కూడా ఓటీటీలో విడుదలవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఆసక్తి చూపుతోందని సమాచారం.

కానీ పలు ఓటీటీ సంస్థలు మాత్రం లవ్ స్టొరీని భారీ మొత్తానికి కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమా బడ్జెట్ కన్నా భారీ లాభాలు పలికేలా జీ 5 ‘లవ్ స్టోరీ’కి భారీ ధర ఆఫర్ చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్

లవ్ స్టోరీ డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. మరి ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ‘లవ్ స్టోరీ’ని దక్కించుకునేది ఎవరో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here