బాబ్బాబు.. లోకేష్ బాబూ.. ఏం చెప్పాబు చినబాబూ!

సడన్ గా మంత్రి అయిన చంద్రబాబు పుత్ర రత్నం లోకేష్ బాబు.. తండ్రి రాజకీయాన్ని బాగానే వంటబట్టించుకున్నట్టున్నారు. ఇన్నాళ్లూ తండ్రి పాడిన పాత పాటనే మళ్లీ పాడుతూ.. జనాన్ని మభ్య పెట్టేందుకు లోకేష్ బాబు కొత్తగా ప్రయత్నించారు.

తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన లోకేష్.. ప్రత్యేక హోదాపై మాట్లాడారు. హోదా కోసం కేంద్రంతో గొడవ పెట్టుకుంటే.. వచ్చే నిధులు ఆగిపోతాయని సెలవిచ్చారు. అందుకే.. ఎక్కువగా వివాదం చేయదలుచుకోలేదని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీతో.. హోదా కంటే ఎక్కువే మేలు జరుగుతోందని కూడా జనానికి కళ్లు తెరిపించారు.

ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కంటే.. ఇంకా ఏమైనా అవసరం ఉన్నా.. పోరాడి తీరతామని కూడా చినబాబు చెప్పారు. ఇదంతా వింటున్న జనం.. కామెడీగా.. ఏం చెప్పావు చినబాబూ.. అంటూ నవ్విపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here