గంగ‌వ్వ‌తో క‌లిసి ఎంజాయ్ చేసిన లాస్య‌..

య్యూటూబ్ స్టార్ గంగ‌వ్వ‌తో క‌లిసి లాస్య సంద‌డి చేసింది. గంగ‌వ్వ లాస్య ఇద్ద‌రూ బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్లుగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే గంగ‌వ్వ మ‌ధ్య‌లోనే వ‌చ్చేసింది. లాస్య కూడా ఎలిమినేట్ అయ్యారు. అయితే గంగ‌వ్వ‌, లాస్య ఇద్ద‌రూ క‌లిసి ప‌ల్లెటూర్లో ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం సొంతూరు లంబాడిపల్లెలో ఉంటున్న గంగవ్వను మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లాన్య కలిసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో లాస్యను గంగవ్వ తన పెద్దబిడ్డ అంటూ పిలిచేది. గంగవ్వను కలిసిన లాస్య ఆమెలాగానే చీర కట్టుకుని పొలాల్లో తిరిగింది. ఆమెతో కలిసి అక్కడి పనులన్నీ చేసింది. గంగవ్వతో కలిసి బోజనం చేసింది. పొలంలోకి దిగి నాట్లు కూడా నాటింది. ఈ వీడియోను లాస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఏమాత్రం చ‌దువుకోని గంగ‌వ్వ ఇంత ఫేమ‌స్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహింలేదు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో వాతావ‌ర‌ణం ఆమె ఆరోగ్యానికి సెట్ అవ్వ‌క‌పోవ‌డంతో ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. ఏదిఏమైనా హౌస్‌లో కాకుండా బ‌య‌ట కూడా ఇలా గంగ‌వ్వ‌కు కొత్త ఫ్యామిలీ దొర‌క‌డం సంతోషించే విష‌య‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here