లేడీ ఓరియెంటెడ్ “అశ్మీ” మూవీ రివ్యూ

న‌టీన‌టులు: రుషికా రాజ్, రాజా న‌రేంద్ర‌, కేశవ్ దీప‌క్

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్ – సాచీ క్రియేష‌న్స్
నిర్మాత – స్నేహా రాకేశ్
ర‌చ‌న – ద‌ర్శ‌కత్వం, సినిమాటోగ్ర‌ఫి – శేష్ కార్తీకేయ‌
ఎడిటింగ్ – ప్ర‌వీణ్ పూడి
మ్యూజిక్ – శాండీ అద్దంకి
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్ర “అశ్మీ.” పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 3 న థియేటర్లలో విడుదలైన ఫీమేల్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ “అష్మీ”.  చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ :

అష్మీ (రుషిక రాజ్) ఓ గదిలో కొన్ని సంవత్సరాలుగా నిర్బంధించబడి ఉంటుంది. ఆమెకు కనీస అవసరాలైన ఇవ్వకుండా తినడానికి సరైన ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేసి మానసికంగా, శారీరకంగా తను ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. అయితే ఆ గది నుంచి బయటపడ్డాక తనను చిత్రహింసలకు గురిచేసింది రాజేశ్ మిశ్రా (కేశవ్ దీపక్) అని నమ్మి అతడిని  చంపేస్తుంది అష్మీ. ఆ తర్వాత తనను చిత్రహింసలకు గురిచేసింది శివ (రాజ నరేంద్ర) అని తెలుసుకుంటుంది. అయితే అసలు అష్మీకి, శివకు మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? ఎందుకోసం శివ అష్మీనీ బంధించి చిత్రహింసలకు గురిచేశాడు? చివరకు అష్మీ శివపై ఏ విధమైన రివేంజ్ తీర్చుకుంది అనే  తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…!!!

నటీనటుల పనితీరు:

నటీనటుల పర్మార్మెన్స్ విషయానికొస్తే..అష్మీ ను కొన్ని సంవత్సరాలుగా ఒక గదిలో బందిస్తే ఆ అమ్మాయి ఎన్ని బాధలు పడింది. అక్కడ ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత తనను బందీగా ఉంచిన వారిపై ఎలాంటి పగ తీర్చుకుంది అనే  సస్పెన్స్ థ్రిల్లర్ కథలో అష్మీ  (రుషిక రాజ్) చాలా చక్కగా నటించింది. ఆమె నటనకు కొత్త అయినస కూడా  చాలా చక్కటి అభినయమైన నటనను కనబరచింది. ఇక రాజ నరేంద్ర, కేశవ్ దీపక్ కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు.అంతా తమ పాత్రల పరిధి మేరకు కన్విన్సింగ్ గా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు శేష్ కార్తికేయ ఓ మంచి కాన్సెప్టును కథగా రాసుకుని  ఒక మంచి ప్రయత్నం తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసును గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడనే  చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్‌కి చేరుకునే వరకు చూస్తున్న ప్రేక్షకులకు బోరింగ్‌గా లేకుండా  అనిపించేలా చక్కగా తీశాడు. కేవలం ముగ్గురు క్యారెక్టర్లతోనే సినిమా  తీసిన దర్శకుడిని కచ్చితంగా అభినందించాల్సిందే.యూత్ కు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. శాండీ అద్దంకి అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి .ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు .ప్రవిన్ పూడి ఎడిటింగ్  బాగుంది. నిర్మాత  స్నేహా రాకేశ్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.లేడీ ఓరియంటెడ్ రివేంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి “అష్మీ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here