కళ్యాణ్ దేవ్ హీరోగా MP ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ప్రారంభం..

‘విజేత’ లాంటి క్లాసిక్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా.. కొత్త సినిమా ప్రారంభం అయింది. MP ఆర్ట్స్ బ్యానర్ లో మోనిష్ పత్తిపాటి నిర్మాతగా M కుమారస్వామి నాయుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. YS కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here