కొణిదెల వారి కుమారి శ్రీమతి కానుంది

‘పెళ్లికి బాజా మోగింది.. కుమారి శ్రీమతి కానుంది’ అని ‘జయం మనదేరా’ సినిమాలో వెంకటేశ్‌ ఆడిపాడారు. ఇప్పుడు నిహారికాకు ఈ పాట బాగా సూట్‌ అవుతుంది. కుమారి కొణిదెల నిహారిక త్వరలో శ్రీమతి కానున్నారు. నటుడు నాగబాబు కుమార్తె, హీరో వరుణ్‌ తేజ్‌ చెల్లెలిగానే కాదు నటిగా తనకంటూ గుర్తింపు పొందారు నిహారిక. పెళ్లి నిశ్చయమైన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపి, ఒక ఫొటోను కూడా షేర్‌ చేశారు నిహారిక. అయితే కాబోయే భర్త గురించిన వివరాలేమీ చెప్పలేదు.

ఇంతకీ మెగా అల్లుడి నామధేయం.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వివరాలేమిటి? అంటే.. నీహారిక పెళ్లాడబోతున్న వరుడి పేరు చైతన్య. అతడు ఓ హయ్యర్ అఫీషియల్ కుటుంబానికి చెందిన వాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం నీహారిక కాబోయే మామగారు గుంటూరు పోలీస్ శాఖలో ఐజీగా పని చేస్తున్నారు. చైతన్య బిట్స్ పిలానీలో అత్యున్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఆగస్టులో నీహారిక- చైతన్య జంట నిశ్చితార్థం జరగనుంది. 2021లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ కానుందట. ఇక చైతన్య ఒడ్డు పొడుగు లుక్ చూస్తుంటే మెగా ఫ్యామిలీలో మరో హీరో జాయినయినట్టేనని అర్థమవుతోంది. ఆ కుటుంబంలో ఇప్పటికే డజను మంది స్టార్లు ఉన్నారు. చిరంజీవి-నాగబాబు- రామ్ చరణ్ – అల్లు అర్జున్- అల్లు శిరీష్- సాయి తేజ్- వరుణ్ తేజ్- నీహారిక- కళ్యాణ్ దేవ్- వైష్ణవ్ తేజ్ ఇంతమంది స్టార్లు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో చైతన్య పేరు కూడా చేరుతుందనే అభిమానులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here