కొత్త పెళ్లికొడుకుతో కీర్తి సురేష్‌.. వైర‌ల్ అవుతున్న న్యూస్‌..

క‌రోనా కేసులు విజృంభిస్తున్నా సినీ ఇండ‌స్ట్రీ మాత్రం పూర్తి స్థాయిలో సినిమాల‌కు సిద్ద‌మ‌వుతోంది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ హీరోలు సినిమాల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇప్ప‌టికే అగ్ర‌హీరోలు సైతం సినిమాలు తీసేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా పెళ్లి అయిన హీరో నితిన్ కూడా షూటింగ్‌కు రెడీ అయ్యారు.

లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తను నటిస్తున్న `రంగ్ దే` సినిమాను సంక్రాంతికి సిద్ధం చేసున్నాడు. కీర్తీ సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్ దుబాయ్‌కు పయనమైంది. వెళ్లిన వెంటనే అక్కడ చిత్రీకరణను ప్రారంభమైంది. అక్కడ షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితిన్, కీర్తి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు సమాచారం. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here