ఆ రోజు భ‌య‌మేసింద‌ని చెప్పిన ఇలియానా..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇలియానా మార్క్ అంద‌రికీ తెలిసిందే. దేవ‌దాస్ చిత్రంతో ప‌రిచ‌య‌మై.. పోకిరి సినిమాతో హిట్ సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. ఆ రోజుకి ఈ రోజు ఏమాత్రం త‌న ప‌ర్స‌నాలిటీలో మార్పు రాకుండా చూసుకున్న ఈ ముద్దు గుమ్మ క‌రోనా త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

బ‌ల్వీంద‌ర్ సింగ్ డైరెక్ష‌న్‌లో అన్ ఫెయిర్ అండ్ ల‌వ్లీ అనే సినిమాలో న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల సినిమా షూటింగ్ ఆగిపోయినా మ‌ళ్లీ ఇప్పుడు ప్రారంభ‌మైంది. అయితే షూటింగ్ మొదటి రోజు భ‌య‌ప‌డ్డాన‌ని ఈ జీరో సైజ్ భామ చెబుతోంది. ఆ త‌ర్వాత క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకొని.. జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగ్ చేస్తున్న‌ట్లు చెప్పింది. కెమెరా ముందుకు వెళ్ల‌గానే న‌ట‌న‌లో మునిగిపోయిన‌ట్లు చెప్పారు. లాక్‌డౌన్ వ‌ల్ల ఇంకా బాగా న‌టిస్తున్న‌ట్లు ఇలియానా అంటున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వచ్చిన ఏ అవ‌కాశాన్ని ఆమె వ‌దులుకోవ‌డం లేదు. ఇక క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత మ‌ళ్లీ షూటింగులు ప్రారంభం అయిన విష‌యం తెలిసిందే. మొద‌ట్లో కాస్త వెనుకంజ వేసిన హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు ధైర్యం చేసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here