చిక్కుల్లో కత్తి మహేష్..

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన అరెస్టయ్యారు.

కత్తి మహేష్ సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. ఈ విషయంపై హిందు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేసాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పలు మార్లు విచారించారు. నేడు కూడా విచారణకు పిలిచారు. అనంతరం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  గతంలోనూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి హైదరాబాద్‌ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే

 

అరెస్ట్ చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఆయన శ్రీరాముడు గురించి కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్, ట్విట్టర్ లో అసభ్యంగా పోస్టు పెట్టారు.

అయితే కత్తి మహేష్ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ అభిమానులు కత్తి మహేష్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇలా ఆయన జైలుకు వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here