దాసరి చనిపోయిన కొన్ని గంటలకే మరొక ప్రముఖ చావు ..

తెలుగు చలన చిత్రం ఇప్పటికే దాసరి దిగ్బ్రాంతి లో ఉండగా మరొక సంచలన వార్త అందరినీ కలచేస్తోంది. అయితే మన రాష్ట్రం లో కాదు కానీ పక్క రాష్ట్రం కన్నడ నాట కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. దాంతో కన్నడ సినిమా పరిశ్రమ తో పాటు తెలుగునాట కూడా ఆవిడ గురించి తెలిసినవారు దిగ్బ్రాంతి లో ఉన్నారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజామున 4.40 గంటలకు కన్నుమూశారు. దాదాపు ఆమె ఎనభయ్యవ ఏట లో చనిపోయారు.

ఆరోగ్యం విషమించడం తో ఈ నెల 14 న బెంగళూరు ఎం ఎస్ రామయ్య ఆసుపత్రి లో చేర్పించారు ఆమెని. అప్పటి నుంచీ వెంటిలేటర్ మీదనే ఉన్నారు ఆమె. ప్రత్యేక ఆపరేషన్ లు చేసినా కూడా ఎలాంటి లాభం లేకపోవడం తో ఆమె చనిపోయారు. రాజ్ కుమార్ లాగానే ఆమె కూడా తన రెండు కళ్ళూ దానం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here