" బాహుబలో వరస్ట్ సినిమా .. చూడకండి వేస్ట్ " ఒక క్రిటిక్ రివ్యూ ఇది

సినిమా ప్రపంచం మొత్తం విపరీతంగా పోగిడేస్తున్న సినిమా బాహుబలి 2 .. నిన్న విడుదల అయిన ఈ చిత్రం మీద ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూ లు తప్ప బాలేదు అని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇండస్ట్రీ వర్గాల దగ్గర నుంచి ఇంటర్నెట్ లో యాక్టివ్ ఉండే జనాల వరకూ అందరూ ఈ సినిమా గొప్పతనం గురించి తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభాస్ తన అద్భుత ప్రదర్సన తో అందరినీ ఆకట్టుకోగా రాజమౌళి తనదైన శైలి లో విజువల్స్ చూపించాడు.
అయితే హిందీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రం ఈ సినిమా మీద తీవ్ర విమర్శలు చేసాడు. ప్రభాస్ అసలు హీరోనే కాదు అంటూ విపరీతమైన ట్వీట్ లు చేసి ఫాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు ఆయన. ఆయన్ను ఎవరైనా హిందీ నిర్మాతలు తమ చిత్రాల్లో తీసుకుంటే ఇడియట్సేనని చెలరేగిపోయాడు. ఈ చిత్రంలో కథ లేదని, గ్రాఫిక్స్ ఘోరమని, రాజమౌళి దర్శకత్వం బాగాలేదని, సంగీతం పరమ చెత్తని అన్నాడు.
ఈ సినిమా కోసం ఎన్ని మైళ్ళు ప్రయాణం చేసి మరీ వెళ్లి చూడడం అంటే చాలా వేస్ట్ పని అనీ కాబట్టి అలాంటి ఆలోచన ఉంటె మానుకోవాలి అన్నాడు ఖాన్. అసలు మూడు గంటల పాటు నిడివి కొనసాగించాల్సిన అవసరమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here