దావూద్ ఇబ్రహీం ఆఖరి రోజులు లో నిజమెంత ?

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చావుకి దగ్గరగా ఉన్నడా ? రోజులు లెక్కబెడుతూ పక్షవాతం తో మంచం మీద పడి ఉన్న డాన్ కి గుండెపోటు రావడం తో బైపాస్ చేసే డాక్టర్ లేక నరకం అనుభవిస్తూ ఉన్నడా ? ప్రస్తుతం పాకిస్తాన్ మీడియా ఇండియన్ మీడియా చేస్తున్న వ్యాఖ్యలు ఇవే. మాఫియా డాన్ గా ప్రపంచాన్ని వణికించిన దావూద్ భాయ్ చావుకి దగ్గర పడుతున్నాడు అంటోంది మీడియా.

కానీ ఇదంతా అబద్ధం అంటున్నాడు ఆయన అనుచరుడు చోటా షకీల్.దావూద్ పై వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని, ఆయన క్షేమంగా ఉన్నాడని ప్రస్తుతం కరాచీలోనే ఉన్న చోటా షకీల్, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఫోన్ చేసి చెప్పాడు.  ” ఆయన మీద వస్తున్న వార్తలు అన్నీ అబద్ధాలు, భాయ్ సంతోషంగా నిక్షేపంగా ఉన్నాడు. నేను చెప్పేది వినండి. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు ” అన్నాడు షకీల్.కరాచీలోని ఆగా ఖాన్ హాస్పిటల్ లో దావూద్ చికిత్స పొందుతున్నాడని, ఆ సమయంలో గుండెపోటు రావడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, ఆయన మరణించి ఉండవచ్చని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here