కళ్యాణ్ రామ్ తో కాజల్ రోమాన్స్ వెనకాల మంచితనం దాగుంది :

సినిమా ఫీల్డ్ లో సహాయం చేసిన వాళ్లకి తిరిగి సహాయం చెయ్యాలి అనే జ్ఞానం ఉనవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. మొదట్లో కాస్త ఒద్దిక గా ఉన్నా కూడా రాను రానూ ఒళ్ళు పొగరుగా మారతారు. ఇక స్టార్ స్టేటస్ వచ్చింది అంటే నువ్వెంత నీ బతుకెంత అనే మాటలు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న తరవాత కూడా కాజల్ తనకి లైఫ్ ఇచ్చినవారిని ఎప్పుడూ మర్చిపోలేదు. చందమామ సినిమాతో తన కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన కృష్ణ వంశీ తో మళ్లీ ‘గోవిందుడు అందరివాడేలే’ చేసింది. ఆ తర్వాత ‘లక్ష్మీకళ్యాణం’ ద్వారా తనకు తొలి అవకాశాన్నిచ్చిన తేజతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేస్తోంది.

ఈ రెండు సినిమాల కోసం కాజల్ స్పెషల్ గా పారితోషికం లో కోత కూడా పెట్టిందట . తాజాగా లక్ష్మీ కళ్యాణం లో తాను మొదటిసారి రోమాన్స్ చేసిన కళ్యాణ్ రాం తో కూడా కాజల్ ఓకే చెప్పేసింది. కాజల్ ఇప్పుడున్న రేంజికి కళ్యాణ్ రామ్ సినిమాకు ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తన మొదటి హీరో అని ఆ సినిమాకి సైన్ చేస్తిందట కాజల్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here