తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ వీడిపోని బంధం అని అన్నారు. ఇదే అంశం మీద ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఎలా అయితే విడాకులు తీసుకొని మాట్లాడుకుంటున్నారో టీడీపీ బీజేపీ పార్టీల మధ్య కూడా అట్లాంటి సంబంధమే ఉంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .
అయితే ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీతో అప్పుడప్పుడు కల్సి పనిచేస్తాం అని ఆయన అన్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ సందర్భంగా జెసి దివాకర్‌రెడ్డి ఇంకా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రత్యేక హోదా కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మాత్రమే రాష్ట్రానికి వస్తుందని అన్నారు.