చైనా, పాకిస్తాన్‌తో యుద్దం చేసేందుకు ఇండియా రెడీ అయ్యిందా..?

చైనా, పాకిస్తాన్‌లు ఎలాంటి ప‌నులు చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. స‌రిహ‌ద్దులో గ‌త ఆరు నెల‌ల నుంచి చైనా భార‌త్‌తో గొడ‌వ పెంచుకుంటూనే ఉంది. ఇక పాకిస్తాన్ ఎప్ప‌టి నుంచో అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో భార‌త్‌పై విరుచుకుప‌డేందుకు సిద్దంగా ఉంది. ఇలాంటి ప‌రిస్థితిలో భార‌త్ చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఏర్ప‌డింది.

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తి స్థాయిలో తొలగిపోని నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, పాక్‌లతో 15 రోజుల పాటు నిరవధికంగా యుద్ధం జరిపేందుకు అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వలను పెంచుకునేందుకు త్రివిధ దళాలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు అత్యవసర ఆర్థిక అధికారల ప్రకారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో..ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు ఆయుధాల నిల్వలు పెంచుకునేందుకు రూ. 50 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు చేసేందుకు సిద్ధమయ్యాయి.

కాగా.. ఇటీవల పాక్, చైనా భారత్‌తో తగవుకు దిగుతుండటంతో కేంద్రం పాత స్థితికి బ్రేక్ చెబుతూ తాజా ఆదేశాలు జారీచేసింది. రూ. 300 కోట్ల విలువైన అత్యవసర కొనుగోళ్లు చేపట్టేందుకు త్రివిధ దళాలకు కేంద్రం ఇదివరకే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత భత్రతా దళాలు విస్త్రత స్థాయిలో రక్షణ కొనగోళ్లు చేపడుతున్నాయి. ఆయుధాలకు సంబంధించి స్పేర్ పార్ట్స్, మందుగుండు సామాగ్రి, మిస్సైల్ వ్యవస్థలను సేరిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..భారత్ వద్ద మిసైళ్లు, యుద్ధ ట్యాంకులు, వాటిల్లో వాడే అమ్యునిషన్ నిల్వలు సైనికుల్లో ఆత్మవిశ్వాసం పెంచే స్థాయికి చేరుకున్నాయి.

గ‌తంలో భారత్ 40 రోజుల యుద్ధానికి సరిపడా ఏర్పాటు చేస్తుకోవాల్సి ఉంది. అయితే..అప్పటి పరిస్థితుల దృష్ట్యా మునుపటి ప్రభుత్వాలు దీన్ని పది రోజులకు కుదించాయి. ఆయుధాలు, అమున్యిషన్(మందుగుండు సామాగ్రి) స్టోర్ చేసేందుకు కావాల్సిన మౌలిక వసుతుల లేమి, మారుతున్న యుద్ధతంత్రాలు, అవసరాల రీత్యా మునుపటి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here