షూటింగ్‌ల‌కు రెడీ అవుతున్న హీరోలు..

మార్చి 22 మొద‌లుకొని ఏప్రిల్, మే, జూన్‌, ఇప్పుడు జులై న‌డుస్తోంది. ఐదు నెల‌ల‌వుతోంది.. ఆరోజు నుంచి నేటి వ‌ర‌కు ఏ సినిమాలు లేవు, షూటింగులు లేవు. ప్ర‌తి సినీ అభిమాని మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న ఇది. కానీ ఇప్పుడు మళ్లీ సినిమాలొచ్చేస్తున్నాయి. షూటింగుల‌కు మ‌న హీరోలు రెడీ అయిపోతున్నారు.

తెలుగు, హిందీ, త‌మిల్‌, క‌న్న‌డ‌. ఇలా భాష వేరైనా మ‌నం దాదాపుగా అన్ని భాష‌ల సినిమాలు చూస్తుంటాం. లాక్ డౌన్ కార‌ణంగా సినిమాలు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు కోవిడ్ మ‌రింత‌గా ముదురుతోంది. ఈ నేప‌థ్యంలో ఇక సినిమాల గురించి మ‌ర్చిపోవాల్సిందేనా అంటే క‌చ్చితంగా కాద‌నే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు షూటింగ్‌ల‌కు నిబంధ‌న‌ల‌తో కూడిన ప‌ర్మిష‌న్స్ ఇచ్చేశాయి.

ఈ నేపథ్యంలో ప‌లువురు హీరోలు సినిమా షూటింగుల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. నిన్న సుదీప్ సినిమా షూటింగ్ కోసం ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. అనూప్ బండారి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం హైద‌రాబాద్‌ను వేదిక‌గా చేసుకుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హీరో సుదీప్ ధైర్యం చేశాడ‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు ఇదే కోవ‌లో మ‌రికొంద‌రు జాయిన్ అవుతున్నారు.

స‌ల్మాన్ ఖాన్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌, జాన్ అబ్ర‌హాం, ఇమ్రాన్ అష్మీలు సినిమాల కోసం రెడీ అవుతున్నారు. స‌ల్మాన్ న‌టించిన రాధే మూవీ క్లైమాక్స్‌లో ఉంది. చిన్న షూటింగ్ అయిపోతే సినిమా పూర్త‌వ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఫారెన్‌లో చేయాల్సిన షూటింగ్‌ను ముంబైలోనే చేయ‌నున్నారు. ఇక ఫారెన్‌లో షూటింగ్ జ‌ర‌గ‌నున్న అక్ష‌య కుమార్ సినిమా కోసం యూనిట్ స‌భ్యులంతా ప్రైవేట్ జెట్స్‌లో ఫారెన్ వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. వీటితో పాటు జాన్ అబ్ర‌హాం, ఇమ్రాన్ అష్మీ సినిమాలు కూడా ప్రారంభంకాబోతున్నాయి.

అయితే తెలుగు హీరోల సినిమాల కోసం అభిమానులు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే ఇంత‌వ‌ర‌కు మూవీ షూటింగుల‌కు రెడీ అవుతున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇంకొన్ని రోజులు స‌మ‌యం తీసుకొని సినిమాలు ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here