సరిహద్దులో హద్దులు మీరుతూ ఆందోళనలకు సృష్టిస్తున్న డ్రాగన్, దాయాదీలకు భారత్ ధీటైన సమాధానం చెప్పింది. ఆక్రమణలకు పాల్పడుతున్నచైనాను, అవకాశం దొరికితే దాడులు చేస్తున్న పాకిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమని ఇండియా ప్రకటించేసింది. దీంతో భారత్ సత్తా ఏంటో ఇటు దేశంతో పాటు అటు ప్రపంచ దేశాలకు తెలిసినట్లైంది.
గత ఐదు నెలల నుంచి సరిహద్దులో చైనా ఏం చేస్తుందో అందరికీ తెలిసిందే. లద్దాక్‌లో ఆక్రమణలకు పాల్పడుతూ చైనా తన వక్రబుద్దిని చాటుకుంటూనే ఉంది. ఏళ్ల నాటి ఒప్పందాలను తుంగలో తొక్కి దాడులకు పాల్పడుతోంది చైనా. దీంతో సరిహద్దులో పరిస్థితులు ఏమీ బాగోలేవు. ఎన్ని సార్లు చర్చలు జరుపుతున్నా ఏదో ఒక వివాదాన్ని చైనా కలుగజేస్తూనే ఉంది. సరిహద్దులో బలగాలు పెంచకుండా వెనక్కు తీసుకోవాలని తాజాగా అంగీకారం చేసినప్పటికీ ఇంకా బలగాలను మాత్రం సరిహద్దుకు తరలిస్తూనే ఉంది.
చైనా పరిస్థితి ఇలాగుంటే అవకాశం దొరికితే భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ కూడా రెడీగా ఉంది. సరిహద్దులో జవాన్లపై కాల్పులు జరుపుతూనే ఉంది. శత్రువుకు శత్రువు మిత్రువు అన్నట్లు చైనాకు సహకారం అందించేందుకు పాక్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌ను సియాచిన్ వద్ద ఎదుర్కొన్న అనుభవం పాకిస్థాన్‌కు మాత్రమే ఉంది. దీంతో ఈ ప్రాంతంలో చైనాకు సహకరించేందకు పాక్ సైనికులను కూడా చైనాకు సహకారం అందించేందుకు పంపిందన్న సమాచారం ఉంది. దీన్ని బట్టి భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఏవిధంగా ఇరు దేశాలు సహాయం చేసుకుంటున్నాయో తెలుసుకోవచ్చు.
సరిహద్దులో ఎలాంటి ముప్పు అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన దళాతిపతి బడౌరియా స్పష్టం చేశారు. సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఉత్తరాన చైనాను, పశ్చిమాన పాకిస్థాన్‌ను ఒకేసారి ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. అయితే శత్రువును మాత్రం తక్కువగా అంచనా వేయడం లేదని.. తమ వంతుగా అన్ని రకాలుగా సిద్ధమైనట్లు చెప్పారు. వాయుసేన దళాదిపతి చెబుతున్న మాటలను బట్టి చూస్తే సరిహద్దులో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. చైనా, పాక్‌లు ఎంతమేర భారత్‌ను దెబ్బకొట్టేందుకు కాచుకొని కూర్చున్నాయో తెలుసుకోవచ్చు.