‘దేవదాసు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి ఇలియానా. అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ గోవా బ్యూటీ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తో పాటు, పలు దక్షిణాది భాషల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇల్లి బేబీ… ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో తెలుగులో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోవడంతో ఇలియానాకు ఆఫర్లు తగ్గాయి.
ఇక ప్రస్తుతం హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఇలియానా వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. సముద్రంలో తెప్పను నడుపుతున్న ఓ వీడియోను పోస్ట్ చేస్తూ..
‘నా బాధ్యతల నుంచి పారిపోతున్నా బై’ అంటూ క్యాప్షన్ ను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.