ఏపీలో హాట్ న్యూస్‌.. నారా లోకేష్‌ను ఏం చేయ‌నున్నారు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫైబ‌ర్ నెట్ స్కాం సంచ‌ల‌నంగా మారింది. వేల కోట్ల కుంభ‌కోణంలో టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చుట్టూ వివాదం ముదురుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏపీ ప్ర‌భుత్వ ఐటీ స‌ల‌హాదారుగా ప‌నిచేసిన వేమూరి హ‌రిప్ర‌సాద్ ముందుముందుగానే స్పందించిన తీరు చూస్తుంటే దీనిలో పెద్ద స్కాం జ‌రిగిన‌ట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఏపీ ఫైబర్ నెట్‌లో స్కాం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వేమూరి హ‌రిప్ర‌సాద్‌ స్పందించిన తీరు ఇప్పుడు అనుమానాల‌కు తావిస్తోంది. అస‌లు ఐటీ స‌ల‌హాదారుగా ఉన్న హ‌రిప్ర‌సాద్‌ ఎందుకు స్పందించార‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. లోకేష్‌కు ఫైబ‌ర్ నెట్‌తో సంబంధ‌మేమీ లేద‌ని ఆయ‌న అన్నారు. ఫైబ‌ర్ నెట్ సంస్థ ఐటీ శాఖ‌కు సంబంధించిన‌ది కాద‌ని.. విద్యుత్ శాఖ‌కు సంబంధించిన‌ది ఆయ‌న వ్యాఖ్యానించ‌డంపై మేధావులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. అవినీతి జ‌రిగితే ప్ర‌భుత్వాలు విచారిస్తాయి. త‌ప్పు జ‌రిగితే బాద్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాయి. అయితే ఈయ‌న ముందుగానే స్పందించ‌డం ఏంట‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ నడుస్తోంది.

చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్‌ను ఈ స్కాంలో లేకుండా త‌ప్పించాల‌న్న భారీ ప్ర‌ణాళిక జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాలీ్లో సాగుతోంది. ఎందుకంటే లోకేష్ టిడిపి హ‌యాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా క‌ళా వెంక‌ట్రావు ప‌నిచేశారు. ఈ విష‌యంలో భారీ స్కాం జ‌రిగింది కాబ‌ట్టే.. ఇందులో నుంచి లోకేష్ ను త‌ప్పించి క‌ళా వెంక‌ట్రావును బ‌లి చేయాల‌న్న ఆలోచ‌న బాబు చేశార‌ని తెలుస్తోంది. అయితే లోకేష్ మాత్రం దీని విష‌యంలో విచార‌ణ చేసుకోండి అని గ‌తంలోనే చెప్పారు. మళ్లీ ఇప్పుడు ప్ర‌భుత్వం సీబీఐ ఎంక్వైరీ చేయాల‌ని చూస్తున్న నేప‌థ్యంలో వేమూరి హ‌రిప్ర‌సాద్‌తో ఇలా మాట్లాడిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

వేమూరి హ‌రిప్ర‌సాద్ ఐటీ స‌ల‌హాదారునిగా ప‌నిచేస్తే.. ఫైబ‌ర్ నెట్ విద్యుత్ శాఖ‌కు సంబంధం అంటున్న నేప‌థ్యంలో వేరే శాఖ‌లో కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తే ఎందుకు ఇంత‌లా రెస్పాండ్ అవుతున్నార‌ని ఇప్పుడు కొత్త ప్ర‌శ్న‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఐటీ శాఖకు సంబందం లేని విష‌యంలో ఏ కుంభ‌కోణం జ‌ర‌గ‌కుంటే ఇంత‌లా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న‌ది ప్ర‌ధాన వాద‌న‌. క‌చ్చితంగా ఫైబ‌ర్ నెట్‌లో జ‌రిగిన కోట్ల కుంభ‌కోణంలో తెలుగుదేశం పెద్ద‌ల‌ను ర‌క్షించేందుకు పావులు కదుపుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏమ‌వుతుందో ప్రభుత్వం చ‌ర్య‌ల ద్వారానే తెలుస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here