ఎదగాలి అంటే అమ్మాయిలు ‘అడ్జస్ట్’ అవ్వాలి – శివగామి మాట

దాదాపు ముప్పై సంవత్సరాల నుంచీ నటిగా సూపర్ గుర్తింపు తెచ్చుకున్న రమ్య కృష్ణ బాహుబలి సీరీస్ తో ఒక మెట్టు ఎగబాకేసింది. తన కెరీర్ లో నీలాంబరి కంటే గొప్ప క్యారెక్టర్ వస్తుంది అని ఊహించలేదు అనీ కానీ శివగామి పాత్ర తనకి ఊపిరి పోసింది అని ఆమె చెబుతున్నారు. సినిమాల్లో ఛాన్స్ ల కోసం ‘అడ్జస్ట్’ అవ్వడం వెనకాల అనేక హీరోయిన్ లు చేస్తున్న వ్యాఖ్యలకి రమ్య సమాధానం చెబుతూ. ” అడ్జస్ట్ మెంట్ అనేది ఆడడానికి అన్ని రంగాల్లో ఉంటుంది.

ఒక్క సినిమా రంగం మాత్రమె కాదు అనేక చోట్ల ఆడడానికి ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా అంతకంటే తెలివిగా మసలుకోవడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీ లేదు ” అనేసింది రమ్య కృష్ణ. కెరీర్ లో ఎదగాలి అంటే అడ్జస్ట్ అవ్వాల్సిందే అంటున్నారు ఆమె. ఏది సరైనదనిపిస్తే, అది చేసుకుంటూ వెళ్లాలని, కొందరికి అది తప్పుగా అనిపించినా, ఎవరి జీవితంపై నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉంటుందని అభిప్రాయపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here