” ముఖ్యమంత్రి జీవితం లో మర్చిపోలేని విషయాన్నీ ఆదివారం బయట పెడతా “

తన మంత్రి పదవి పోవడం పోవడమే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసారు కపిల్ శర్మ. కుంభకోణాల దగ్గర నుంచీ అనేక విషయాల వరకూ ముఖ్యమంత్రి ని ఫుల్ గా టార్గెట్ చేసిన శర్మ ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఒక్కొక్క విషయాన్నీ ఒక్కొక్కసారి ఓపెన్ అప్ అవుతున్న శర్మ రాబోయే ఆదివారం అంటే ఎల్లుండి ఒక అద్భుత విశేషం చెప్పబోతున్నా అని ప్రకటించారు. ఆ విషయానికి సంబంధించి ఎలాంటి క్లూ లేదు కానీ ఇవాళ మీడియా తో మాట్లాడిన ఆయన ఈ సారి విషయాన్ని పూర్తి ఆధారాలతో బయట పెడతా అన్నారు.

తాను చేసిన ఆరోపణలు నిజం కనుకనే ఇంతవరకూ కేజ్రీవాల్ నోరు మెదపలేదని అన్నారు. కేజ్రీ ఇంత నిశ్శబ్ధంగా ఉండటం తానెన్నడూ చూడలేదని, వాటర్ ట్యాంకర్ స్కామ్ తో పాటు, అక్రమంగా నిధులు కూడబెట్టి, ఐదుగురు ఆప్ మంత్రులను ఆయన విదేశాలకు పంపించారని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here