” ఒంటరిగా ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళను .. జీవిత ఉండాల్సిందే .. కారణం ఉంది ” రాజశేఖర్

రాజశేఖర్ ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ” నేను యాక్టింగ్ కి సంబంధించిన విషయాలపైన .. హెల్త్ కి సంబంధించిన విషయాలపైన మాత్రమే శ్రద్ధ పెడుతూ వుంటాను. ఇంటికి సంబంధించిన మిగతా విషయాలన్నీ జీవితనే చూసుకుంటూ ఉంటుంది. మా పెద్దమ్మాయి 10 రోజుల పాపగా వున్నప్పుడే నేను ఔట్ డోర్ షూటింగ్ కి తీసుకెళ్లాను. అప్పటి నుంచి ఔట్ డోర్ షూటింగ్ ఎక్కడ వున్నా వాళ్లు లేకుండగా నేను వెళ్లలేదు” అని అన్నారు.
“పిల్లలు పుట్టిన తరువాత నేను ఇంతవరకూ ఒంటరిగా ఫ్లైట్ లో వెళ్ల లేదు. ఉదయం వెళ్లి సాయంత్రం రావాలన్నా నలుగురం వెళతాం .. నలుగురం వస్తాం .. ఎందుకంటే అదో భయం. ఎక్కడికి వెళ్లినా నేనే కారు నడుపుతాను .. వేరే వాళ్లు కారు నడిపితే వాళ్లపై నాకు అంత నమ్మకం ఉండదు. ఫ్లైట్ నేను నడపలేను గదా .. అందుకే భయం. పోతే అందరం కలిసి పోతాం .. ఉంటే అందరం కలిసి ఉంటాం .. ఆ ఉద్దేశంతోనే అలా చేస్తాను” అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here