ఆ డైరెక్టర్ తో నాకు అటువంటి సంబంధం లేదు: రాశి ఖన్నా

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాశి ఖన్నా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. టాలీవుడ్ సినిమా రంగంలో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో నటించిన ‘తొలిప్రేమ’ సినిమా తో హిట్ కొట్టడం జరిగింది.అయితే తాజాగా ఈ అమ్మడు మీద ఇండస్ట్రీలో ఓ రూమర్ నడుస్తోంది డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఎఫైర్ ఉన్నట్లు .

ఈ నేపథ్యంలో తొలిప్రేమ సినిమా విజయంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘సుప్రీమ్’ సినిమాతో తనకి అనిల్ రావిపూడి హిట్ ఇవ్వడం వలన, ఆయన తదుపరి సినిమా అయిన ‘రాజా ది గ్రేట్’ లో స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేశాను. దాంతో అనిల్ రావిపూడితో ముడిపెడుతూ కొంతమంది ప్రచారం చేశారు.

అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు కావడం వలన .. నాకు మరో స్నేహితుడైన రవితేజ మూవీ కావడం వలన ఆ సినిమాలో ఆ సాంగ్  చేశాను .. అంతకి మించి మరేమీలేదు.ఇలాంటి రూమర్స్ వింటుంటే నవ్వు వస్తుందని అంటున్నారు హీరోయిన్ రాశి ఖన్నా. ప్రస్తుతం రాశి ఖన్నా నితిన్ హీరోగా చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here