ఏపీలో ఒక్క రోజులో ఎన్ని క‌రోనా కేసులంటే..

ఆంద్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. తాజాగా నమోదైన కేసులను చూస్తే పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని అడతామవుతోంది. ఒక్క రోజులోనే 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది మృత్యువాత పడ్డారు.

ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఒక్క రోజే 1398, 1069 కేసులు వచ్చాయి. ఇక ప్రకాశం జిల్లాలో 1146 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 76,465 సంపుల్స్ పరీక్షించారు. కరోనా కేసుల టెస్టింగుల్లో ఏపీ మొదటి నుండి ముందంజలో ఉంది. ప్రతి రోజు 60 వేళకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అందుకే కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువ వస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేటు ఆసుపత్రిలో కానీ కరోనా పేషేంట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సీఎం జగన్ చెప్పారు. నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్రస్తుతం ఏపీలో 95,733 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క రోజులో 10,292 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here