గంగవ్వకు పెరుగుతున్న మద్దతు..

నాగార్జున హోస్ట్ గా ‘బిగ్ బాస్ 4’ అత్యంత అట్టహాసంగా ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. 16 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. ఇక ఈ సీజన్ లో తొలి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. మొదటగా.. యూట్యూబ్ మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వను ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. అయితే వారు దీనికి ఒక మంచి కారణాన్ని కూడా చెప్పారు.

బయట గంగవ్వకు మంచి ఫాలోయింగ్ ఉంది. జనాలు ఎలాగైనా గంగవ్వకు ఓట్లు వేస్తారు. కాబట్టి ఆమె ఇంటి నుంచి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇంటి సభ్యులు చెప్పినట్లే.. గంగవ్వకు సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది… మేము బిగ్ బాస్ షో చూడక పోయినా సరే, గంగవ్వకే ఓటు వేస్తామని సోషల్ మీడియాలో గంగవ్వను ట్రెండ్ చేస్తున్నారు. గంగవ్వకు ఈసారి అత్యధికంగా ఓట్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. మరి యూట్యూబ్ తో సెలబ్రిటీగా మారిన గంగవ్వ బిగ్ బాస్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here