ర‌క్తంతో ప్ర‌ధాన‌మంత్రికి లేఖ రాసిన రైతులు.. మోదీ ఏం చేయ‌నున్నారు..

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టాల‌ను రైతులు వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతులు ఆందోళ‌న‌లు కూడా చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్నా అవి స‌ఫ‌లం కావ‌డం లేదు. దీంతో రైతులు త‌మ ఆందోళ‌న‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు.

రైతులు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి తమ రక్తంతో లేఖలు రాశాలు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ వారు లేఖల ద్వారా ప్రధానిని మరోసారి డిమాండ్ చేశారు. సింఘూ సరిహద్దు వద్ద ఏర్పాటైన రక్తదాన శిబిరంలో పాల్గొన్న సమయంలో రైతులు ఈ లెఖలు రాశారు. లేఖ‌లో ఏం రాశారంటే..

నరేంద్ర మోదీ గారికి శుభోదయం, మేము మా రక్తంతో ఈ లేఖను రాస్తున్నాము. మా ఓట్లతో ఈ దేశానికి మీరు ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ..కొత్త చట్టాల కారణంగా రైతులు వెన్నుపోటుకు గురయ్యారు. కాబట్టి ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని మేము కోరుతున్నాము’ అంటూ ఓ రైతు తన లేఖలో పేర్కొన్నారు. ‘ఈ నల్ల చట్టాలను వెన్కు తీసుకోవాలి. వీటిని మేం తిరస్కరిస్తున్నాం’ అంటూ మరి కొంతమంది రైతులు రక్తంతో సందేశాలు రాశారు.

మ‌రి రైతులు ర‌క్తంతో లేఖ‌లు రాశార‌న్న విష‌యం తెలియ‌గానే ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఎంతో మంది రైతుల‌కు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇప్పుడు ర‌క్తంతో లేఖ‌లు రాయ‌డంతో మ‌రింత మంది ఆలోచిస్తున్నారు. ఈ విష‌యంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ఎలా ముందుకు వెళుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. రైతులు మాత్రం చ‌ట్ట‌ల్లో స‌వ‌ర‌ణ‌ల కంటే చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేందుకే డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here