అవునా.. అదెలా.. సినిమా విడుద‌లై ఇంకా మూడు వారాలు కాలేదు

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాలేదు.. ప‌క్క రాష్ట్రాల్లో అంత పెద్ద‌గా విడుద‌ల‌య్యే రేంజ్ కూడా లేదు.. కాదు ఏమైనా గ్రాఫిక్స్ మేజిక్ చేసిన సినిమాన అంటే ఏదో ఒక‌టి రెండు సీన్ల‌కు వాడి ఉంటారు… సినిమా అంత బాగుందా అంటే సో.. సో మ‌రీ రూ.వంద కోట్లు ఎలా వ‌చ్చాయి.. ఇదంత డీజే అదే దువ్వాద జ‌గ‌న్నాథ‌మ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్న ముచ్చ‌ట‌.
ఇటీవ‌ల ఈ సినిమా వాళ్లు ఏదో ఒక ఫంక్ష‌న్ చేసి రూ.100 కోట్లు కొల్ల‌గొట్టిన సినిమా… అభిమానులు త‌దిత‌రుల‌కు థ్యాంక్స్ అంటూ స‌భ ముగించేశారు. ఆ ఫంక్ష‌న్‌లో చెప్పిన రూ.వంద కోట్లు నిజంగా వ‌చ్చాయా..?  వ‌స్తే అలా ఎలా వచ్చాయి..? అని అంద‌ర్నీ వేధిస్తున్న ప్ర‌శ్న‌లు. అయినా ఈ న‌డిమ‌ధ్య సినిమా ఎలా ఉంది అని ఎవ‌రూ ప‌ట్టించుకుంటున్నారు. ఎని్న కోట్లు వచ్చాయనేవే చూస్తున్నారు. మా సినిమా తొలి రోజు ఇన్ని వ‌చ్చాయి.. రెండో రోజు.. మూడో రోజు.. వారం.. ప‌ది ఇలా ప్ర‌తిదీ లెక్క‌గ‌డుతూ వారికి వారు ఊక‌దంపుడు చేస్కుంటున్నారు.
సినిమా ఫ‌ర్వాలేదు. కానీ సినిమాకు అన్ని కోట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అన్ని కోట్లు ఎలా వ‌చ్చాయ‌ని ఎంత‌గా ఆలోచించినా లెక్క తేల‌ట్లేదు. మ‌నం లెక్క‌లు వేసుకుంటే తిప్పి కొడితే రూ.40 కోట్లు వ‌చ్చి ఉంటాయ‌ని అంద‌జ‌గా (అంచ‌నా) వేస్కుందాం. పైగా ఈ సినిమా క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళ్ ఎక్స‌ట్ర భాష‌ల్లో కూడా అంత‌గా రిలీజ్ కాలేదు. పైగా ఈ సినిమా న‌డుస్తున్న టైమ్ లో మిగ‌తా సినిమాలు బాగానే ఆడుతున్నాయి. అమీతుమీ, మ‌ర‌క‌త‌మ‌ణి ఎక్స‌ట్ర సినిమాలు ఇంకా బాగానే ఆడుతున్నాయి.
మ‌రీ అంత మొత్తం వ‌చ్చే ఛాన్స్ లేదు. డౌటొచ్చి ఇదే ప్న‌శ్న‌ను నాకు తెల్సినోళ్ల‌ను ఒక‌రిద్ద‌ర్ని అడిగిన‌. హే గంతలేదు. గ‌దంతా ఉట్టి ముచ్చ‌ట అని తీసిపారేశారు. గ‌వ‌న్నీ గొప్ప‌లు సెప్కొడానికే. గ‌ట్ల చెబితే ఇంకొంత‌మంది సూడ్డానికొస్తారని చెప్పారు. ఇక నేను క్లారిటీకి వ‌చ్చా. గ‌దంతా ఉట్టి ముచ్చ‌టేన‌నుకున్నా. అయినా ఎక్కువ‌.. చెప్పుకున్నా వ‌చ్చేదేముంది.. పోయేదేముంది. ఇజ్జ‌త్ ఖ‌రాజు త‌ప్ప హ‌. మంచి సినిమాల‌ను ఎవ‌రైనా ఆద‌రిస్తారు. పెళ్లిచూపులు సినిమానే మ‌న‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ఏమంటారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here